Indraganti: నిర్మాతగా మారిన ఇంద్రగంటి!

Indraganti another movie as a producer
  • దర్శకుడిగా విభిన్న కథా చిత్రాలు
  • సుధీర్ బాబు - కృతి శెట్టి జోడిగా సినిమా 
  • త్వరలో సెట్స్ పైకి మరో ప్రాజెక్టు
  • నూతన నటీనటులతో సినిమా  
దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ స్థానం ప్రత్యేకం. కథాకథనాలను ఆయన నడిపించే తీరు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా ఉంటాయి. 'అష్టా చెమ్మా' .. 'జెంటిల్మెన్' .. 'సమ్మోహనం' సినిమాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.

ఆయన తాజా చిత్రంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రూపొందుతోంది. సుధీర్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. మహేంద్రబాబు - కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఇక ఇంద్రగంటి ఈ సినిమా తరువాత మరో ప్రాజెక్టును లైన్లో పెట్టాడట. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారాడని చెబుతున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ వారితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. నటీనటులంతా కొత్తవారే ఉంటారని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Indraganti
Sudheer Babu
Kruthi Shetty

More Telugu News