డిస్నీ హాట్ స్టార్ కి నితిన్ 'మాస్ట్రో'

19-08-2021 Thu 17:29
  • నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో'
  • కథానాయికగా నభా నటేశ్
  • కీలకమైన పాత్రలో తమన్నా
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్  
Maestro will be released in OTT
నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ 'మాస్ట్రో' సినిమాను రూపొందించాడు. నిఖితా రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, నితిన్ జోడీగా నభా నటేశ్ అలరించనుంది. కొంతకాలం క్రితం హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. హిందీలో 'టబు' చేసిన పాత్రను ఇక్కడ తమన్నా చేసింది.

ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీలో వదులుతారా? అనే విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో రానున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాను 32 కోట్లకు 'డిస్నీ హాట్ స్టార్' వారు తీసుకున్నారనీ, 'వినాయకచవితి' కానుకగా వచ్చేనెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు చెబుతున్నారు.

మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో శ్రీముఖి అలరించనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న నితిన్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.