Kishan Reddy: జన ఆశీర్వాద యాత్ర చివర్లో కిషన్ రెడ్డికి స్వల్ప గాయం

Small injury to Kishan Reddy in Vijayawada
  • ఏపీలో పర్యటించిన కిషన్ రెడ్డి
  • తిరుమల నుంచి విజయవాడ రాక
  • ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం
  • పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
  • కారు డోర్ తలకు తగిలిన వైనం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం విజయవాడ వచ్చారు. ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొని అనేక అంశాలపై ప్రసంగించారు.

కాగా, జన ఆశీర్వాద యాత్ర ముగింపులో కిషన్ రెడ్డికి స్వల్ప గాయమైంది. ఆయన కారు ఎక్కుతుండగా డోర్ తలకు గట్టిగా తగిలింది. గాయం చిన్నదే కావడంతో కిషన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. దాంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News