Jeevan Reddy: కేసీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలోమీటర్ల లోతుకు తొక్కుతాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

If KCR orders we will dig Rewanth to a depth of 300 km says Jeevan Reddy
  • రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి
  • నిన్నటి బహిరంగసభలో అన్నీ అబద్ధాలే చెప్పారు
  • 2009లో పొత్తు వల్లే రేవంత్ గెలిచారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగసభలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. నిరుద్యోగులకు, మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. మహిళల రుణాలకు రూ. 200 కోట్ల వడ్డీ చెల్లించామని తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 26 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు భూమిలో పాతి పెట్టారని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సోనియా రాజ్యం వచ్చే పరిస్థితే లేదని చెప్పారు. 2009లో పొత్తు వల్లే రేవంత్ గెలిచారని... కేసీఆర్ వల్లే రేవంత్ కు టీపీసీసీ ఉద్యోగం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలోమీటర్ల లోతుకు తొక్కుతామని చెప్పారు.
Jeevan Reddy
KCR
TRS
Revanth Reddy
Congress

More Telugu News