KCR: కేసీఆరే కోర్టుకు వెళ్లి ‘దళితబంధు’ను ఆపుతారు: ఈటల

  • దళితబంధు పథకంతో నా బొండిగ పిసకాలని చూస్తున్నారు
  • దళితులను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు
  • 40 ఏళ్లైనా రాష్ట్రవ్యాప్తంగా అమలు సాధ్యం కాదు
Etela Rajender Fires on KCr

దళితబంధు పథకాన్ని ఎవరో ఆపేస్తారనుకోవడం సరికాదని, ముఖ్యమంత్రి కేసీఆరే కోర్టుకు వెళ్లి ఆపి వేయించేస్తారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిన్న దళిత సంఘాల ఆధ్వర్వంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన బొండిగ పిసికేందుకే కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఈటల ఆరోపించారు.

నాలుగేళ్లలో దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ 40 ఏళ్లైనా అమలు సాధ్యం కాదన్నారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి దగా చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పథకం అమలుకు రూ. 2.5 లక్షల కోట్లు అవసరమని, బడ్జెట్ లేకుండా పథకం అమలు ఎలా సాధ్యమని ఈటల ప్రశ్నించారు.

More Telugu News