హీరో విశాల్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. లైకా ప్రొడక్షన్స్ కు జరిమానా

18-08-2021 Wed 20:45
  • 'చక్ర' సినిమాకు సంబంధించిన వివాదం 
  • తాము తీయాలనుకున్న సినిమాను విశాల్ తీశాడంటూ కోర్టుకెక్కిన లైకా
  • లైకా ప్రొడక్షన్స్ కు రూ. 5 లక్షల జరిమానా
  • కోర్టుల మీద తనకున్న నమ్మకం నిజమైందన్న విశాల్
Actor Vishal gets relief in Madras High Court
తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే, విశాల్ నిర్మించిన 'చక్ర' అనే సినిమాకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఈ కథను తొలుత తమకు చెప్పాడని, ఆ కథ నచ్చి సినిమా తీసేందుకు తాము సిద్ధపడ్డామని... అయితే, ఆ తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడని లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కింది. అయితే ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అంతేకాదు లైకా ప్రొడక్షన్స్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది.
 
ఈ సందర్భంగా ట్వట్టర్ ద్వారా విశాల్ స్పందిస్తూ... న్యాయస్థానాల మీద తనకున్న నమ్మకం నిజమయిందని చెప్పాడు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందనే విషయం మరోసారి రుజువయిందని తెలిపాడు. కేసును కోర్టు డిస్మిస్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశాడు.