మిస్టరీ థ్రిల్లర్ 'నేనే నా?' నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

18-08-2021 Wed 17:41
  • రెజీనా ప్రధాన పాత్రధారిగా 'నేనే నా?'
  • ఓ మర్డర్ చుట్టూ తిరిగే కథ 
  • కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్ 
  • త్వరలోనే ట్రైలర్ రిలీజ్   
Intresting poster from Nena Na movie
తెలుగు తెరపై రెజీనా కథానాయికగా కొంతకాలం పాటు తన దూకుడును కొనసాగించింది. అలా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత కొత్త కథానాయికల కారణంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నాయిక ప్రధానమైన కథలకు గ్రీన్ ఇగ్నల్ ఇస్తూ వెళుతోంది.  

అలా ఇంతకుముందు ఆమె చేసిన 'ఎవరు' సినిమా హిట్ కొట్టేసింది. ఆ తరువాత ఈ తరహా కథలనే ఆమె సెట్స్ పైకి తీసుకెళ్లింది. అలాంటి సినిమాలలో ఒకటిగా 'నేనే నా' కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. పూడ్చి పెట్టబడిన ఒక అస్థిపంజరాన్ని బయటికి తీసి, పరిశీలిస్తూ రెజీనా ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

చూస్తుంటే ఇది క్రైమ్ నేపథ్యంలో ఒక మర్డర్ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ .. అక్షర గౌడ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు.