Afghanistan: కోట్లాది రూపాయ‌ల ఆస్తులు వ‌దులుకుని.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో భార‌త్ కు వ‌చ్చిన ఆఫ్ఘ‌నిస్థాన్ కోటీశ్వ‌రుడు

  • తాలిబ‌న్ల క‌ల‌కలంతో విదేశాల‌కు ఆఫ్ఘ‌న్లు
  • ఢిల్లీకి వచ్చిన‌ ఇమ్రాన్ (28)
  • అత‌డికి ఆ దేశంలో  కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, వ్యాపారాలు
  • కాబుల్‌లోనే అతడి కుటుంబం  

ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు వెనక్కు వెళ్తున్న నేప‌థ్యంలో త‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు విదేశాల‌కు వలస వెళ్లిపోతున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఆస్తుల‌న్నీ వ‌దిలి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వారు దేశాన్ని విడిచి వెళ్తున్న తీరు క‌ల‌చివేస్తోంది.

ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇమ్రాన్ (28) అనే యువకుడు భారత్‌కు వచ్చాడు. ఇమ్రాన్‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌లో కోటీశ్వ‌రుడు. అత‌డికి ఆ దేశంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు,
వ్యాపారాలు వున్నాయి. వాట‌న్నింటినీ ఆయ‌న వ‌దులు‌కుని ఢిల్లీకి రావాల్సి వ‌చ్చింది. అతనికి కాబుల్‌లో మూడు కోట్ల టర్న్‌ఓవర్ కలిగిన ఆటో స్పేర్‌పార్ట్స్ వ్యాపారం కూడా ఉంది.

అయితే, కోట్ల రూపాయ‌ల ఆస్తుల క‌న్నా ప్రాణ‌మే ముఖ్య‌మ‌ని ఆఫ్ఘ‌న్‌ను వ‌ద‌లివచ్చేశాడు. ఇప్పుడు ఆయ‌న ఢిల్లీలో నిరుపేద‌గా జీవనం కొన‌సాగిస్తున్నాడు. కాబుల్‌లోనే చిక్కుకుపోయిన‌ తన కుటుంబాన్ని కూడా ఢిల్లీకి తీసుకురావాలని ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నాడు. ఇమ్రాన్ మాత్ర‌మే కాదు.. చాలా మంది త‌మ ఆస్తులు వ‌దులుకుని, విదేశాల‌కు వెళ్లి చిన్నపాటి ఉద్యోగం అయినా చేసుకుని బతకడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

More Telugu News