Parvateesham: 'సావిత్రి W/0 సత్యమూర్తి' నుంచి ఆసక్తికరమైన టీజర్!

  • తెరపైకి మరో హాస్యభరిత చిత్రం
  • కొత్త కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడి ప్రయోగం
  • పార్వతీశం జోడీగా సీనియర్ నటి శ్రీలక్ష్మి  
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Savitri Wife Of Satyamurthy teaser released

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి కొత్త దర్శకులు దూసుకొచ్చేస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా కథను చెప్పగలిగితేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే ఉద్దేశంతో ప్రయోగాలు చేస్తున్నారు. అలా యంగ్ కమేడియన్ పార్వతీశం .. సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా, 'సావిత్రి W/0 సత్యమూర్తి' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య ఎలా?' అంటూ పోస్టర్ పై ఒక సింగిల్ లైన్ తో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. కథానాయకుడైన సత్యానికి 1980లోనే పెళ్లి అవుతుంది. ఆయన భార్యకి 60 ఏళ్లు వచ్చేస్తాయి. ఆయన మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలానే కనిపిస్తుంటాడు.

ఇది ఎలా సాధ్యం? అనే ప్రశ్ననే ఆ చుట్టుపక్కలవారిని వేధిస్తూ ఉంటుంది. ఆయన అంత యంగ్ గా కనిపించడం వెనుక ఏదో మతలబు ఉందని అనుకుంటారు. అదేమిటో తెలుసుకోవాలనుకుంటారు. ఈ పాయింట్ చుట్టూనే ఈ కథ తమాషాగా తిరుగుతుందన్న విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. గోగుల నరేంద్ర నిర్మించిన ఈ సినిమాకి చైతన్య కొండా దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News