Sampoornesh Babu: ఆసక్తిని రేపుతున్న 'బజార్ రౌడీ' ట్రైలర్!

bazaar Rowdy trailer released
  • సంపూ నుంచి 'బజార్ రౌడీ'
  • హీరోగా ఆయనకి 5వ సినిమా
  • కథానాయికగా మహేశ్వరి పరిచయం
  • ఈ నెల 20వ తేదీన విడుదల  
సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా 'బజార్ రౌడీ' సినిమా రూపొందింది. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి, వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా మహేశ్వరి అనే అమ్మాయి పరిచయమవుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఇంతకుముందు ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. సంపూ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన యాక్షన్ విజువల్స్ బాగున్నాయి. "రౌడీలకు రామాయణం చెబితే రావణాసురుడిని ఫాలో అవుతారుగానీ, రాముడిని కాదు".. "వచ్చిన వాడు కాళీ ... నాకు ఎదురొచ్చినవాడు ఖాళీ" అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సినిమాను గురించి సంపూ మాట్లాడుతూ .. "నేను చేసిన 5వ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ మరింత ఇష్టపడేలా ప్రయత్నం చేశాను. చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఈ సినిమాతో వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Sampoornesh Babu
Maheshwary
Naagineedu

More Telugu News