Byreddy Rajasekhar Reddy: వలంటీర్లు రూ.20 వేలు జీతం డిమాండ్ చేయాలి: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

BJP leader Byreddy Rajasekhar Reddy says volunteers should fight for better salary
  • వలంటీర్ల అంశంపై స్పందించిన బైరెడ్డి
  • వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని వెల్లడి
  • వలంటీర్లు పోరాడాలని పిలుపు
  • బీజేపీ అండగా ఉంటుందని హామీ
బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీలోని వలంటీర్ల అంశంపై స్పందించారు. తక్కువ జీతం ఇస్తూ వలంటీర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు. పావలా ఇచ్చి రూ.100 చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఇది అన్యాయం అని, దేశంలో ఎక్కడా జరగడంలేదని పేర్కొన్నారు. వలంటీర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. వలంటీర్లు రూ.20 వేలు జీతం డిమాండ్ చేయాలని, ఈ క్రమంలో  బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. రూ.20 వేలు జీతం ఇస్తే తప్ప వలంటీర్లు ఉద్యోగంలో కొనసాగరాదని అన్నారు. జీతంతో పాటు ఇతర సదుపాయాల కోసం కూడా వలంటీర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
Byreddy Rajasekhar Reddy
Volunteers
Salary
BJP
Andhra Pradesh

More Telugu News