Afghanistan: దేశ ప్రజలందరికీ తాలిబన్ల క్షమాభిక్ష.. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధుల్లో చేరాలని ప్రకటన!

Talibans declares general amnesty to government officials
  • దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజులకు తాలిబన్ల ప్రకటన
  • రోజువారీ కార్యకలాపాల్లో ఉద్యోగులంతా యథావిధిగా పాల్గొనాలని పిలుపు 
  • పూర్తి విశ్వాసంతో విధులు చేపట్టాలని సూచన 
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. దేశాన్ని చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్ల నుంచి ఈ ప్రకటన వెలువడింది.  

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పూర్తి విశ్వాసంతో విధుల్లోకి చేరాలని సూచించారు. రోజువారీ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొనాలని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాలిబన్ల ప్రకటన నేపథ్యంలో అక్కడి ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Afghanistan
Talibans
Government Employees
General Amnesty

More Telugu News