ఏపీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో మరో రెండు చార్జిషీట్ల దాఖ‌లు

17-08-2021 Tue 12:33
  • వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కేసుల్లో దాఖ‌లు చేసిన ఈడీ
  • సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా విచార‌ణ జ‌రిపిన ఈడీ
  • మ‌నీలాండ‌రింగ్ అభియోగాల‌తో చార్జిషీట్లు దాఖ‌లు చేసిన ఈడీ
  • ఇప్ప‌టికే ఏడు ఈడీ చార్జిషీట్ల‌పై విచార‌ణ‌ జ‌రుపుతోన్న సీబీఐ, ఈడీ కోర్టు
charge sheets on jagan cases
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కోర్టులో మ‌రో రెండు చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కేసుల్లో ఈ చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు విచార‌ణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మ‌నీలాండ‌రింగ్ అభియోగాల‌తో చార్జిషీట్లు దాఖ‌లు చేశారు. కాగా, ఇప్ప‌టికే ఏడు ఈడీ చార్జిషీట్ల‌పై సీబీఐ, ఈడీ కోర్టు విచార‌ణ‌ జ‌రుపుతోంది.