టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుద‌ల‌.. చాలా కాలం త‌ర్వాత భార‌త్‌-పాక్ మ్యాచ్‌.. తేదీ ఖ‌రారు

17-08-2021 Tue 12:17
  • అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు టోర్నీ
  • ఒమన్‌తో పాటు యూఏఈలో మ్యాచులు
  • అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌
  • న‌వంబ‌రు 14న ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌లో
ICC T20 World Cup India to play Pakistan in Dubai on October 24
టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ ఈ రోజు విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. ఈ మ్యాచులు ఒమన్‌తో పాటు యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి. చాలా కాలం త‌ర్వాత భార‌త్-పాక్ క్రికెట్ పోటీలో త‌ల‌ప‌డ‌నున్నాయి.  అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుందని ఐసీసీ ప్ర‌క‌ట‌న చేసింది. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీ ఫైనల్‌  మ్యాచ్ ఉంటుంద‌ని, అదే నెల‌ 14న ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంద‌ని తెలిపింది.