అల్లు అర్జున్ జోడీగా అనన్య పాండే?

17-08-2021 Tue 11:23
  • బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్
  • 'లైగర్'తో తెలుగు తెరకు పరిచయం
  • 'ఐకాన్' కోసం సంప్రదింపులు
  • దాదాపు ఓకే అయ్యే ఛాన్స్  
Ananya Pandey in Allu Arjun movie
అనన్య పాండే .. బాలీవుడ్ కుర్రాళ్లు ఈ పేరును ఒక మంత్రంలా జపిస్తూ ఉంటారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో ఆమె అక్కడి కుర్రాళ్ల కలలరాణిగా మారిపోయింది. అప్పటి నుంచి ఈ సుందరిని తెలుగు తెరకి తీసుకురావడానికి చాలామంది దర్శకులు ట్రై చేశారుగానీ కుదరలేదు. ఈ విషయంలో పూరి జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు.

ఆయన తాజా చిత్రమైన 'లైగర్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయం కానుంది. విజయ్ దేవరకొండ జోడీగా ఆమె ఆరబోసే అందాలు చూడటానికి ఇక్కడి కుర్రాళ్లంతా కాచుకుని కూర్చున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే ఈ భామ అల్లు అర్జున్ జోడీగా ఛాన్స్ కొట్టేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

'పుష్ప' సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా అనన్య పాండేను ఎంపిక చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.