walk: న‌డ‌క‌తో గుండెకు మేలు.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

  • మెడికల్‌ జర్నల్‌ ‘న్యూరాలజీ’లో ప్ర‌చుర‌ణ‌
  • గుండెపోటుకు గురైన వారికి న‌డ‌క వ‌ల్ల ఆరోగ్యం
  • వారంలో 3-4 గంటల పాటు నడవగలిగితే ర‌క్ష‌ణ‌
  • 54 శాతం వ‌ర‌కు మ‌ర‌ణాల రిస్క్ త‌గ్గుతుంది
walking is good exercise for heart

న‌డ‌క మ‌నిషి శ‌రీరానికి మంచి వ్యాయామం. న‌డ‌క వ‌ల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి. ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం నిరూపిత‌మైంది. ఈ క్రమంలో గుండె ఆరోగ్యంపై న‌డ‌క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై తాజాగా ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌న ఫ‌లితాల‌ను మెడికల్‌ జర్నల్‌ ‘న్యూరాలజీ’ ప్రచురించింది.

గుండెపోటుకు గురైన వాళ్లు వారం మొత్తంలో 3-4 గంటల పాటు నడవగలిగితే  54 శాతం వ‌ర‌కు మ‌ర‌ణాల రిస్క్ త‌గ్గుతుంద‌ని చెప్పారు. ఇవే ప్ర‌యోజ‌నాలు వారంలో 3-4 గంట‌ల పాటు సైకిల్‌ తొక్కడం లేదా వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల కూడా చేకూరుతాయ‌ని తెలిపారు.

గుండెపోటుకు గురైన వారు రోజుకు 30 నిమిషాల నడక లేక‌ సైక్లింగ్ చేయ‌డం అల‌వాటుగా మార్చుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచించారు. వ్యాయామంతో యువకులకు అధిక‌ లాభం చేకూరుతుంద‌ని వివ‌రించారు. అంతేగాక‌, 75 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న‌వారు వ్యాయామం చేయడం వల్ల మరణించే అవకాశాలు 80 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు.

More Telugu News