YS Sharmila: మహబూబాబాద్ జిల్లాలో నేడు షర్మిల ఉద్యోగ దీక్ష.. రేపటి నుంచి పోడు యాత్ర ప్రారంభం

YS Sharmila to take Udyoga deeksha in Mahabubabad district
  • సోమ్ల తండాలో సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న షర్మిల
  • అనంతరం గుండెంగా గ్రామంలో ఉద్యోగ దీక్ష
  • రాత్రి వరంగల్ లో బస
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడి... కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన కార్యాచరణలో భాగంగా జిల్లాల్లో నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు.

జిల్లాలోని సోమ్ల తండాలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. అనంతరం అదే జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఆమె ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత రాత్రి వరంగల్ లో బసచేయనున్నారు. రేపు పోడు భూములపై పోరాటాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పోడు యాత్రను నిర్వహించనున్నారు. ఆ తర్వాత రేపు సాయంత్రానికల్లా హైదరాబాదుకు చేరుకుంటారు.
YS Sharmila
YSRTP
Udyoga Deeksha
Podu Yatra
Mahabubabad District

More Telugu News