Russia: తాలిబన్లతో నేడు భేటీ కానున్న రష్యా రాయబారి.. కీలక ప్రకటన వెలువడే అవకాశం

  • ఆఫ్ఘన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రష్యా
  • ఆఫ్ఘన్ కు మరోసారి సహకారం అందించే దిశగా అడుగులు
  • 1979 ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ కు అండగా ఉన్న రష్యా
Russian ambassador to held crucial meeting with Taliban leaders

ఆప్ఘనిస్థాన్ లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు తాలిబన్ నేతలతో రష్యా రాయబారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఈ చర్చలు ఫలిస్తే ఆఫ్ఘనిస్థాన్ లోకి రష్యా మరోసారి ప్రవేశించే అవకాశం ఉంది.

వాస్తవానికి గతంలో కూడా ఆఫ్ఘన్లకు రష్యా సహకారం అందించింది. 1979 ప్రాంతంలో ఆఫ్ఘన్ కు రష్యా అండగా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పటి సోవియట్ యూనియన్ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యన్ బలగాలు వెనక్కి మళ్లాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్ఘన్ కు సహకారం అందించేందుకు రష్యా ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు తాలిబన్లకు సహకరిస్తామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రష్యా రాయబారి భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

More Telugu News