'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి 'చుక్కలమేళం' సాంగ్!

17-08-2021 Tue 10:49
  • 'పలాస' దర్శకుడి నుంచి మరో సినిమా 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • ప్రత్యేక ఆకర్షణగా మణిశర్మ సంగీతం 
  • ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల  
Sridevi Soda Center lyrical song released
సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. 'పలాస 1978' దర్శకుడి నుంచి వస్తున్న మరో సినిమా ఇది. విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం' అంటూ ఈ పాట సాగుతోంది. ఖవాలి  వరుసల్లో మణిశర్మ ఈ బాణీ కట్టారు. ఈ తరహా పాటలు బాగా చేస్తారనే పేరు మణిశర్మకు ఉంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపనతో ఈ పాట సాగింది.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సుధీర్ బాబు కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఆనంది మరింత అందంగా కనిపిస్తోంది. 84 బోట్లతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 'జాంబి రెడ్డి' తరువాత ఆనంది చేస్తున్న ఈ సినిమా, ఆమెకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.