Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

  • నిన్న 25,166 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679
  • నిన్న 437 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,32,079
 bulletin on corona cases

దేశంలో కొత్త‌గా నమోదైన కరోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న 25,166 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఇంత త‌క్కువ‌గా కొత్త కేసులు న‌మోదు కావ‌డం 154 రోజుల్లో ఇదే తొలిసారి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 36,830 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 437 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,32,079కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,48,754 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 146 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకుంది.

3,69,846 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55,47,30,609 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.51 శాతంగా ఉంది.

More Telugu News