Afghanistan: కాబూల్ లో కర్ఫ్యూ విధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ నిర్మానుష్యం!

  • దేశాన్ని వీడి వెళ్లేందుకు ఆఫ్ఘన్ల ప్రయత్నాలు
  • జనాలతో నిండిపోయిన కాబూల్ ఎయిర్ పోర్ట్
  • ప్రజలను కట్టడి చేసేందుకు తాలిబన్ల కీలక నిర్ణయం
Talibans imposes curfew in Kabul

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తాలిబన్లు అత్యంత కఠినమైన షరియా చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాలిబన్ల పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో దేశాన్ని వదిలి వెళ్లేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా కాబూల్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. వీలైనంత త్వరగా దేశాన్ని వీడిపోవాలనే ఆత్రుత కాబూల్ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్ట్ నిన్న ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో కాబూల్ లో గందరగోళ పరిస్థితులను నియంత్రించేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్ లో అధికారికంగా కర్ఫ్యూ విధించింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

More Telugu News