కర్నూలు జిల్లాలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య

17-08-2021 Tue 08:27
  • కోడుమూరులో హబీబ్ బాషా ఆత్మహత్య
  • హబీబ్ కు పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు
  • 5 వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టమనే భావనతో ఆత్మహత్య
Volunteer in Kurnool district commits suicide
ఏపీలో మరో వాలంటీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెదిన వార్డు వాలంటీర్ హబీబ్ బాషా (26) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... స్థానిక సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న అల్లుగుండు అబ్దుల్ ఖాదర్, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు హబీబ్ బాషా. ఇద్దరు కొడుకులకూ పెళ్లి చేయాలని అబ్డుల్ ఖాదర్ నెల క్రితం నిర్ణయించారు.

అయితే, ప్రభుత్వం ఇచ్చే రూ. 5 వేల వేతనంతో పెళ్లైన తర్వాత కుటుంబాన్ని పోషించం కష్టమని హబీబ్ బాధపడేవాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పేవాడు. చివరకు ఒత్తిడికి తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం 3 గంటలకు ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కొడుకు శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయారు. అండగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.