ఏపీలో తొలిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థుల శాతం ఎంతంటే..!

17-08-2021 Tue 08:38
  • నిన్న పునఃప్రారంభమైన పాఠశాలలు
  • కేవలం 50 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు
  • మాస్కులు ధరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు  
50 pecent strudents attended on first day of schools reopening
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లారు.  కరోనా భయం వెంటాడుతుండడంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకంజవేస్తున్నారు. దీంతో తొలిరోజు హాజరు తగ్గింది. ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి హాజరయ్యారు. పాఠశాల తరగతి గదులలో భౌతిక దూరం పాటిస్తుండడం వల్ల విద్యార్థులకు సరిపడా రూములు లేక, కొన్ని చోట్ల షిఫ్టుల వారీగా క్లాసులు నిర్వహించినట్టు తెలుస్తోంది.