సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-08-2021 Tue 07:12
  • నయనతార పాత్రలో అనుష్క?
  • 19తో 'ఆర్ఆర్ఆర్' షూట్ పూర్తి
  • మణిరత్నం సినిమా అప్ డేట్  
Anushka to act in Netrikans Telugu remake
*  నయనతార కథానాయికగా నటించిన 'నేత్రికన్' తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో ఈ పాత్రని అనుష్క పోషించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇందులో కథానాయిక అంధురాలిగా కనిపిస్తుంది.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ లపై ఓ పాటను అక్కడ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 19తో అక్కడి షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియిన్ సెల్వన్' చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇప్పటికి ఈ చిత్రం షూటింగ్ 75 శాతం పూర్తయినట్టు సమాచారం. ఇందులో ఐశ్వర్య రాయ్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.