Afghanistan: కాబూల్ విమానాశ్రయలో మరోసారి కాల్పుల మోత

Another firing at Kabul Airport
  • ఆఫ్ఘనిస్థాన్ లో సంక్షోభం
  • తాలిబన్ గుప్పిట్లో ఆసియా దేశం
  • రాజధాని కాబూల్ లో ఎగిరిన తాలిబన్ జెండా
  • విమానాశ్రయానికి పోటెత్తుతున్న ప్రజలు
ఆఫ్ఘనిస్థాన్ లో తీవ్ర భయాందోళనకర వాతావరణం నెలకొంది. తాలిబన్లు కాబూల్ లోని అధ్యక్ష భవనంపై జెండా ఎగురవేసిన నేపథ్యంలో ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. తాలిబన్లు కాబూల్ సరిహద్దుల్లోకి రాగానే ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు పోటెత్తారు. దాంతో తమ విమానాలకు భద్రత కల్పించే క్రమంలో అమెరికా సైనికులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. తాజాగా కాబూల్ ఎయిర్ పోర్టులో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా సైనికులు ఇద్దరు సాయుధులను కాల్చి చంపారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వారికి ఆయన ఏ విధమైన భరోసా ఇస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆఫ్ఘన్ తాజా సంక్షోభానికి బైడెన్ విధానాలే కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రసంగంపై యావత్ ప్రపంచం వేచిచూస్తోంది.
Afghanistan
Kabul Airport
Firing
US Troops

More Telugu News