రెండో టెస్టులో విజయానికి మరో 5 వికెట్ల దూరంలో భారత్

16-08-2021 Mon 21:36
  • లార్డ్స్ లో గెలుపు ముంగిట భారత్
  • 272 రన్స్ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ తడబాటు
  • 67 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • ఇంగ్లండ్ ను హడలెత్తించిన భారత పేసర్లు
India needs another five wickets to win Lords test
లార్డ్స్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్... ఇషాంత్ శర్మ, బుమ్రా, షమీల ధాటికి కకావికలమైంది. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. భారత్ విజయానికి మరో 5 వికెట్లు కావాలి. ఇషాంత్ 2, బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా, షమీ ఓ వికెట్ పడగొట్టాడు. కాసేపు పోరాడిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (33)ను బుమ్రా ఓ అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ శిబిరం నిరుత్సాహానికి గురైంది.

ప్రస్తుతం ఇంగ్లండ్ 34 ఓవర్ల అనంతరం 5 వికెట్లకు 88 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 184 పరుగులు చేయాలి. ఆటకు నేడు చివరి రోజు కాగా, మరో 26 ఓవర్లు మిగిలున్నాయి.