ట్విట్టర్ పిట్టలను వేపుడు చేసి ట్విట్టర్ కు పార్శిల్ చేసిన ఏపీ కాంగ్రెస్ శ్రేణులు

16-08-2021 Mon 21:24
  • ఇటీవల రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా నిలిపివేత
  • కాంగ్రెస్ వర్గాల ఆగ్రహం
  • వినూత్న రీతిలో నిరసన తెలిపిన హర్షకుమార్ అనుచరులు
  • డౌన్ డౌన్ బీజేపీ అంటూ నినాదాలు
Congress workers fries twitter birds and send parcel to twitter head quarters
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ వర్గాలు ట్విట్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ నేత హర్షకుమార్ అనుచరులు రాహుల్ ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత పట్ల వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్టలను వేపుడు చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా ఢిల్లీలోని ట్విట్టర్ ఇండియా ప్రధాన కార్యాలయానికి పార్శిల్ చేశారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడం ద్వారా ట్విట్టర్ నిర్వాహకులు పెద్ద తప్పు చేశారని, పైగా కాంగ్రెస్ ట్వీట్లను ట్విట్టర్ ప్రమోట్ చేయడంలేదని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు.