పెదకాకాని పీఎస్ నుంచి నారా లోకేశ్ విడుదల

16-08-2021 Mon 20:47
  • రమ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు
  • నారా లోకేశ్ అరెస్ట్
  • లోకేశ్ ను పలు స్టేషన్లకు తిప్పిన పోలీసులు 
  • 151 సీఆర్పీసీ కింద అభియోగాల నమోదు
Nara Lokesh released from Pedakakani police station
గుంటూరులో హత్యకు గురైన రమ్య అనే బీటెక్ విద్యార్థిని కుటుంబాన్ని ఇవాళ టీడీపీ నేతలు పరామర్శించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తిప్పినట్టు తెలుస్తోంది. లోకేశ్ పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. తాజాగా లోకేశ్ ను పెదకాకాని పీఎస్ నుంచి విడుదల చేశారు.

విడుదలకు ముందు, పోలీసులు లోకేశ్ తో నోటీసులపై సంతకం పెట్టించుకున్నారు. కాగా పోలీసులు లోకేశ్ ను తమ కాన్వాయ్ లోనే తరలించి, పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్లలో తిప్పినట్టు తెలుస్తోంది. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా తరలించారు.