తిరుమల చేరుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

16-08-2021 Mon 20:07
  • ఈ మధ్యాహ్నం రేణిగుంట వచ్చిన ఓం బిర్లా
  • పద్మావతి అమ్మవారి దర్శనం
  • తిరుమలలో టీటీడీ వర్గాల స్వాగతం
  • రేపు శ్రీవారి దర్శనం
Lok Sabha speaker Om Birla arrives Tirumala
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఏపీ వచ్చారు. ఈ మధ్యాహ్నం రేణి గుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై తిరుమల కొండపైకి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లాకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఓం బిర్లా రేపు వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేద పాఠశాల సందర్శనతో పాటు, అధికారులతోనూ సమీక్ష చేపట్టనున్నారు.