ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

16-08-2021 Mon 18:15
  • గవర్నర్ ముఖ్య కార్యదర్శి మీనాకు స్థానచలనం
  • పరిశ్రమల శాఖకు బదిలీ
  • గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా
  • పియూష్ కుమార్ జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్
Transfers for IAS Officials in AP
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) కార్యదర్శిగా బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించారు.  

అటు, పీయూష్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పీయూష్ కుమార్ ఇప్పటివరకు రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్ గా ఉన్నారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గా రవిశంకర్ నారాయణ్ ను బదిలీ చేశారు. ఆయనకు అదనంగా డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ బాధ్యతలు కూడా అప్పగించారు.

లక్ష్మీనరసింహంకు సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. హరిజవహర్ లాల్ కు సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.