ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు... అప్ డేట్స్ ఇవిగో!

16-08-2021 Mon 17:47
  • గత 24 గంటల్లో 909 పాజిటివ్ కేసుల నమోదు
  • ఇదే సమయంలో 13 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 17,218
Andhra Pradesh reports 909 new corona cases
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 46,962 మంది శాంపిల్స్ పరీక్షించగా, 909 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 241 కేసులు నమోదు కాగా.. అనంతపూర్ జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 1,543 మంది పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,94,606 కేసులు నమోదు కాగా... 19,63,728 మంది కోలుకున్నారు. మొత్తం 13,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.