Mynampally Hanumantha Rao: చేతికి గాజులు తొడుక్కోలేదు.. బండి సంజయ్ ను గుడ్డలూడదీసి నిలబెడతా: మైనంపల్లి వార్నింగ్

Will stand Bandi Sajay without cloths says Mynampally
  • బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
  • కేసీఆర్ ఒక్క రోజు అవకాశమిస్తే బీజేపీ నేతల అంతు చూస్తా
  • సంజయ్ భూముల వ్యవహారాన్ని త్వరలోనే బయట పెడతా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పై నిన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఒక రోజు అవకాశమిస్తే బీజేపీ నేతల అంతు చూస్తానని అన్నారు. బండి సంజయ్ గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉందని భయపడే ప్రసక్తే లేదని... తాను చేతులకు గాజులు వేసుకోలేదని అన్నారు.

బండి సంజయ్ భూముల వ్యవహారాన్ని త్వరలోనే బయట పెడతానని మైనంపల్లి చెప్పారు. కరీంనగర్ జిల్లాలో దేవాలయాలను దోచుకున్న చరిత్ర సంజయ్ దని అన్నారు. బండి సంజయ్ మాదిరే మరో బీజేపీ నేత కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని... ఆయన సంగతి కూడా చూస్తానని చెప్పారు. తెలంగాణలో అశాంతిని రేకెత్తించేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు.
Mynampally Hanumantha Rao
TRS
KCR
Bandi Sanjay
BJP

More Telugu News