లార్డ్స్ టెస్టులో 200 దాటిన టీమిండియా ఆధిక్యం
- ఆసక్తికరంగా లార్డ్స్ టెస్టు
- రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్
- 96 ఓవర్లలో 8 వికెట్లకు 233 రన్స్
- 61 పరుగులు చేసిన రహానే
పంత్ 22 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (3) విఫలమయ్యాడు. ఇషాంత్ శర్మ (16) విలువైన పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 200 దాటింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఫలితంపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ డ్రా అవ్వొచ్చని, ఒక్కోసారి స్వల్ప టార్గెట్లను ఛేదించలేక జట్లు చతికిలపడిన సందర్భాలు ఉన్నాయని క్రికెట్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.