దేవాలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించిన స్టాలిన్ ప్రభుత్వం

16-08-2021 Mon 15:22
  • 24 మంది బ్రాహ్మణేతరులు పూజారులుగా నియామకం
  • ఆలయాల్లో పని చేయడానికి మరో 138 మంది నియామకం 
  • వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణన  
Stalin govt appoints non brahmins as priests in temples
తమిళనాడులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణేతరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు కూడా పూజారులుగా మారనున్నారు. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణేతరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది.

వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాల వారు, ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు.