బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి.. రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆరోపణలు!

16-08-2021 Mon 14:34
  • పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారు
  • పిటిషనర్ పై సీబీఐ, క్రిమినల్ కేసులు ఉన్నాయన్న విజయసాయి
  • తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసిన కోర్టు
Vijayasai reddy files counter in CBI court
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు విజయసాయిరెడ్డి ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు.

రాజకీయపరమైన పబ్లిసిటీ కోసమే పిటినర్ (రఘురామకృష్ణరాజు) ఈ పిటిషన్ వేశారని కౌంటర్ లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. పిటిషనర్ పై ఇప్పటికే సీబీఐ, క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు విజయసాయి కౌంటర్ పై వాదనలు వినిపించేందుకు రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.