శ్రీహరి తనయుడు హీరోగా 'రాసిపెట్టుంటే'

16-08-2021 Mon 12:15
  • 'రాజ్ దూత్'తో హీరోగా పరిచయం
  • సెట్స్ పై 'కోతి కొమ్మచ్చి' సినిమా
  • కరోనా కారణంగా ఆలస్యమైన షూటింగ్
  • సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త ప్రాజెక్టు 
Meghamsh new movie with new director
శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా కొత్త ప్రాజెక్టు మొదలవుతోంది. శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాకి 'రాసిపెట్టుంటే' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో, నందు మల్లెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం మేఘాంశ్ 'రాజ్ దూత్' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. కానీ కష్టపడితే కుర్రాడు నిలబడతాడని అంతా చెప్పుకున్నారు.

ఆ తరువాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'కోతి కొమ్మచ్చి' సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగు దశలోనే ఉంది. కరోనా వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ లోగానే మేఘాంశ్ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.