'మంచిరోజులు వచ్చాయి' నుంచి లిరికల్ సాంగ్ వీడియో!

16-08-2021 Mon 11:45
  • మారుతి నుంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ
  • సంతోష్ శోభన్ జోడీగా మెహ్రీన్
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  • సిద్ శ్రీరామ్ గానం ప్రత్యేక ఆకర్షణ
Manchi Rojulu Vachhayi lyrical video released
మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులు వచ్చాయి' సినిమా రూపొందింది. సంతోష్ శోభన్ కథానాయకుడిగా, వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. సాయితేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ పాట, 'సో సో గా ఉన్నాననీ .. సో స్పెషలే చేశావులే' అంటూ సాగుతోంది.

అనూప్ రూబెన్స్ సంగీతం .. కె.కె. సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తోంది. యూత్ నచ్చే బీట్ లోనే అనూప్ ఈ పాటకి బాణీ కట్టాడు. తనువులు వేరైనా మన ఊపిరి ఒకటే .. ఊహలు ఒకటే . దారులు ఒకటే అంటూ ఈ పాట నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మారుతి కెరియర్ యూత్ కి సంబంధించిన కథలతో .. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలతో మొదలైంది. ఆ తరువాత ఆయన ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వెళ్లాడు. మళ్లీ ఇంతకాలానికి ఆయన యూత్ ను కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.