నేను చెబుతున్నాను .. రాసిపెట్టుకోండి: హీరో శ్రీవిష్ణు

16-08-2021 Mon 10:50
  • ఫస్టాఫ్ లో నవ్విస్తుంది
  • సెకండాఫ్ లో ఎమోషన్ ఎక్కువ
  • ప్రతి లాంగ్వేజ్ లో రీమేక్ అవుతుంది
  • తప్పకుండా హిట్ కొడతాం    
Srivishnu says about Raja Raja Chora movie
తెలుగు తెరకు మరో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు .. ఆ దర్శకుడి పేరే హసిత్ గోలి. తన తొలి ప్రయత్నంగా ఆయన 'రాజ రాజ చోర' సినిమాను రూపొందించాడు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, మేఘ ఆకాశ్ .. సునైన కథానాయికలుగా అలరించనున్నారు. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై శ్రీ విష్ణు మాట్లాడుతూ .. "కథ వినగానే నాకు బాగా నచ్చింది. దర్శకత్వం హసిత్ గోలికి కొత్తే అయినా ఎక్కడా అలా అనిపించదు. కామెడీని కొత్తగా ఆయన ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా కడుపుబ్బా నవ్విస్తుంది .. సెకండాఫ్ అంతా కూడా ఎమోషన్ తో సాగుతుంది.

ఈ సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత వైవిధ్యం కలిగిన పాత్రను చేసినందుకు గర్వంగా ఉంది. నేను నిజం చెబుతున్నాను .. రాసి పెట్టుకోండి. ఈ సినిమా ప్రతి లాంగ్వేజ్ లోను రీమేక్ అవుతుంది. కథలో అంత కొత్తదనం .. దమ్ము ఉన్నాయి. తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం అందరిలోను ఉంది" అని చెప్పుకొచ్చాడు.