ఆన్ లైన్ పెళ్లి.. వధూవరులు ఆస్ట్రేలియాలో... కర్నూలులో పురోహితుడు!

16-08-2021 Mon 10:50
  • ఆస్ట్రేలియాలో ఉంటున్న రజిత, దినేశ్ రెడ్డి
  • రెండేళ్ల క్రితమే పెళ్లి జరిపించాలని పెద్దల నిర్ణయం
  • కరోనాతో వాయిదా పడుతూ వచ్చిన వివాహం
Online marriage in Kurnool
కరోనా వైరస్ ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేసింది. మనుషులు కలవలేని పరిస్థితులను కరోనా తీసుకొచ్చింది. పెళ్లిళ్లు, చావులకు కూడా కలవలేని పరిస్థితి దాపురించింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. విధిలేని పరిస్థితుల్లో ఆన్ లైన్ ద్వారా ఒక పెళ్లి జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, కర్నూలుకు చెందిన రజిత, నల్గొండకు చెందిన దినేశ్ రెడ్డిలు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే కరోనా వల్ల వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా నుంచి వారు ఇండియాకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో... ఆన్ లైన్ లోనే పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లితంతును కర్నూలులోని ఓ పంక్షన్ హాల్ లో జరిపించారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఆస్ట్రేలియాలోని ఫంక్షన్ హాల్లో కూర్చున్నారు. కర్నూలు ఫంక్షన్ హాల్లో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఆన్ లైన్ లైన్ ద్వారా వధూవరులు ఆస్ట్రేలియాలో పెళ్లి తంతును కొనసాగించారు. పురోహితుడి మార్గదర్శకాల ప్రకారం రజిత మెడలో దినేశ్ రెడ్డి తాళి కట్టారు. దీంతో నవ వధూవరులు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వధూవరులను ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు ఆన్ లైన్ ద్వారానే ఆశీర్వదించారు.