paritala sriram: స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడే నడిరోడ్డుపై దళిత ఆడ కూతురిని పొడిచి చంపడం దారుణం: ప‌రిటాల శ్రీ‌రామ్‌

paritala sriram fires on ycp
  • అర్ధ‌రాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం
  • మ‌హాత్మా గాంధీ గారు ఈ విష‌యాన్ని ఎప్పుడో చెప్పారు
  • ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి?
  • ప్ర‌భుత్వానికి ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ‌ చట్టాన్ని అమలు చేయడంలో లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో బీటెక్ విద్యార్థినిని ఓ యువ‌కుడు క‌త్తితో పొడిచి చంపడం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దారుణ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత ప‌రిటాల శ్రీ‌రామ్ మండిప‌డ్డారు.

'అర్ధ‌రాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం' అని ఆయ‌న అన్నారు.

'ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఈ దిశ చట్టాలు, యాప్ లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ‌ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?' అని ప‌రిటాల శ్రీ‌రామ్ ప్రశ్నించారు.
paritala sriram
Telugudesam
Andhra Pradesh

More Telugu News