చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సినీ ప్రముఖులు

16-08-2021 Mon 10:29
  • సినీ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవిని ఆహ్వానించిన జగన్
  • నిన్న చిరంజీవిని కలిసిన మంత్రి పేర్ని నాని
  • పలు సమస్యలపై చర్చ
Chiranjeevi meeting with film personalities and Perni Nani
సినీ నటుడు చిరంజీవి ఇంట్లో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని సినీ పెద్దలతో కలసి వచ్చి చిరంజీవిని కలిశారు. సినీ పరిశ్రమ, థియేటర్ల సమస్యలను వివరించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశం కొనసాగింది.

భేటీకి హాజరైన సినీ ప్రముఖుల్లో నాగార్జున, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్.నారాయణమూర్తి, ఎన్వీ ప్రసాద్, సి.కల్యాణ్, వీవీ వినాయక్, కొరటాల శివ ఉన్నారు. సమావేశం సందర్భంగా సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు, ఇతర సమస్యలపై చర్చలు జరిపారు.