'అన్నాత్తే' స్పీడ్ తగ్గడం లేదు!

16-08-2021 Mon 10:11
  • భారీ తారాగణంతో రూపొందుతున్న 'అన్నాత్తే'
  • ఇటీవలే షూటింగు పార్టు పూర్తి 
  • ప్రస్తుతం జరుగుతున్న డబ్బింగ్ పనులు 
  • దీపావళి పండుగకు విడుదల
Annaatthe movie update
రజనీకాంత్ .. శివ కాంబినేషన్లో 'అన్నాత్తే' రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అందువల్లనే కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగును కొనసాగించారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఆ వెంటనే డబ్బింగును మొదలుపెట్టారు. ముందుగా రజనీకాంత్ .. ఆ తరువాత మీనా తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పేశారు. తాజాగా ఖుష్బూ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తయింది. అనుకున్న ప్రకారం ఎక్కడా ఆలస్యం కాకుండా పక్కా ప్లానింగుతో టీమ్ ముందుకు వెళుతోంది.

ఈ సినిమాలో మీనా .. ఖుష్బూ తో పాటు నయనతార .. కీర్తి సురేశ్ కూడా అలరించనున్నారు. వీరిలో ఆల్రెడీ నయనతార .. మీనా .. ఖుష్బూ కథానాయికలుగా విజయాలను అందుకున్నవారే. ఇక జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇమాన్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లనుంది.