YS Jagan: శ్రీకాళహస్తిలో జగన్‌కూ ఓ దేవాలయం.. రూ. 2 కోట్లతో నిర్మించిన వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

  • జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఆలయ నిర్మాణం
  • ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్తూపాల ఏర్పాటు
  • ప్రారంభించిన తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి
 Temple to Jagan in Srikalahasti at a cost of Rs 2 Cr

శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓ గుడి కట్టించారు. 'నవరత్నాల నిలయం' పేరుతో నిర్మించిన ఈ ఆలయంలో జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు.

భారీగా నిర్మించిన ఈ ఆలయంలో హుండీ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే, ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు, విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చు. ప్రసాదాలుగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలు అందిస్తారు. జగనన్న నవరత్నాల నిలయాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యుడు ఎం.గురుమూర్తి ప్రారంభించారు.

More Telugu News