రణరంగంగా మారిన వరంగల్ జిల్లా నర్సంపేట.. గుడిసెలు ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత
- ఎంసీపీఐయూ పిలుపుతో భారీగా తరలివచ్చిన పేదలు
- జెండా ఎగరేసి గుడిసెలు వేసుకున్న వైనం
- గుడిసెలు తొలగించి సామగ్రిని కాల్చేసిన పోలీసులు
- ఆరుగురి అరెస్ట్
సమాచారం అందుకున్న ఆర్డీవో పవన్‌కుమార్, ఏసీపీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ సతీశ్ బాబు, తహసీల్దార్ రామ్మూర్తి ఆధ్వర్యంలో వరంగల్ నుంచి వచ్చిన పోలీసు, రెవెన్యూ సిబ్బంది గుడిసెలను తొలగించి సామగ్రికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పేదల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం జరిగిన తోపులాటలో పలువురు స్పృహతప్పి కిందపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అందరినీ పంపించివేశారు.