సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

16-08-2021 Mon 07:31
  • 'మాస్ట్రో' పక్కన స్టయిల్ గా తమన్నా!
  • సాయితేజ్ 'రిపబ్లిక్' విడుదల తేదీ
  • పాయల్ తో ఆది సాయికుమార్ 'టీఎంకే'      
Thamanna look from Mastro film out
*  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'మాస్ట్రో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నభా నటేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం నుంచి తాజాగా తమన్నా, నితిన్ ల లుక్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.
*  మెగా హీరో సాయితేజ్ కథానాయకుడుగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న 'రిపబ్లిక్' చిత్రం విడుదల తేదీని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలు పోషించారు.
*  ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. కల్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న లాంఛనంగా మొదలైంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. హాస్య నటుడు సునీల్, పూర్ణ కీలక పాత్రలలో నటిస్తున్నారు.   దీనికి 'టీఎంకే' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.