హైతీ భూకంప విలయంలో 1,297కు చేరిన మృతుల సంఖ్య
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే
- రాత్రంతా రోడ్లపైనే గడిపిన జనం
- క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన ఆసుపత్రులు
శనివారం రోజంతా ప్రకంపనలు వణికించగా, నిన్న తెల్లవారుజామున కూడా భూమి ఆరుసార్లు కంపించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాత్రంతా వీధుల్లోనే గడిపారు. తీరప్రాంత పట్టణమైన లెస్‌కేయస్ తీవ్రంగా దెబ్బతింది. క్షతగాత్రులను ఇక్కడి నుంచి రాజధానికి తరలించేందుకు మాజీ సెనేటర్ ఒకరు ప్రైవేటు విమానాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని పోగొట్టుకున్న వారి రోదనలతో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపం కారణంగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.