మ్యూజికల్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' విజేతగా పవన్‌దీప్ రాజన్.. నిరాశపరిచిన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ

16-08-2021 Mon 06:56
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కొనసాగిన గ్రాండ్ ఫినాలే
  • ఆద్యంతం ఉత్కంఠ భరితం
  • విజేతకు రూ. 25 లక్షల చెక్
Indian Idol 12 winner is Pawandeep Rajan
ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగించిన పాప్యులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచాడు. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా, సేలీ కాంబ్లే మూడో స్థానంలో నిలిచారు. మహ్మద్ దనిష్, నిహాల్ నాలుగైదు స్థానాలకు పరిమితమయ్యారు.

విజేత రాజన్‌ రూ. 25 లక్షల చెక్ అందుకున్నాడు. దీంతోపాటు ట్రోఫీ, ఓ కారు కూడా లభించాయి. ఫస్ట్, సెకండ్ రన్నరప్స్ అయిన అరుణిత, సేలీకి రూ. 5 లక్షలు, థర్డ్, ఫోర్త్ రన్నరప్స్ అయిన దనిష్, నిహాల్‌కు రూ. 3 లక్షల చెక్ అందించారు. అలాగే, టాప్ సిక్స్ ఫైనలిస్టులకు రాజ్ సూపర్ వైట్ సోప్ నుంచి రూ. 75 వేల చొప్పున అందించగా కోల్గేట్, డెన్వర్‌లు గిఫ్ట్ హ్యాంపర్‌లు అందించాయి.

నిన్న మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన గ్రాండ్ ఫినాలే అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సాగింది. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్‌లో ఎట్టకేలకు రాజన్ విజేతగా నిలిచాడు. కాగా, ఈ సీజన్‌కు ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అనుమాలిక్, సోను కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అతిథులుగా జావెద్ అలీ, సుఖ్విందర్ సింగ్, సాధన సర్గమ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్ తదితరులు హాజరయ్యారు.