లార్డ్స్ లో పుజారా, రహానే పోరాటం... సెంచరీ దాటిన భారత్ ఆధిక్యం

15-08-2021 Sun 21:36
  • భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • లార్డ్స్ మైదానంలో మ్యాచ్
  • రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్న టీమిండియా
  • 112 పరుగులకు చేరిన ఆధిక్యం
India recovers well after Pujara and Rahane spirited fight in Lords test
లార్డ్స్ టెస్టులో భారత్ కోలుకుంది. రెండో ఇన్నింగ్స్ లో ఓ దశలో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ఆపై పుజారా, రహానేల పోరాటంతో పుంజుకుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్లకు 139 పరుగులు కాగా, ఆధిక్యం 112 పరుగులకు పెరిగింది. రహానే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, 186 బంతులు ఎదుర్కొన్న పుజారా 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, రేపటి ఆట మరింత రసవత్తరంగా ఉండనుంది.