Om Birla: చిత్తూరు జిల్లాలో రెండ్రోజుల పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటన

Lok Sabha speaker Om Birla two days tour in Chittoor district
  • రేపు మధ్యాహ్నం రేణిగుంట రాక
  • తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం
  • సాయంత్రం తిరుమల పయనం
  • ఎల్లుండి వేదపాఠశాల సందర్శన
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రెండ్రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటారు. తిరుమలలో ఓం బిర్లా శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.

ఎల్లుండి ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆపై, పద్మావతి గెస్ట్ హౌస్ లో టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆయన తన పర్యటనలో భాగంగా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించనున్నారు.
Om Birla
Lok Sabha Speaker
Chittoor District
Andhra Pradesh

More Telugu News