కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు... ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అహ్మద్ జలాలీ

15-08-2021 Sun 19:31
  • ఆఫ్ఘన్ లో మరింత ముదిరిన సంక్షోభం
  • అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించిన సర్కారు
  • శాంతిభద్రతలపై అప్రష్ ఘనీ ఆందోళన
  • శాంతి నెలకొల్పాలని భద్రతా బలగాలకు విజ్ఞప్తి
Talibans has taken over Afghan capital Kabul
ఆఫ్ఘనిస్థాన్ లో తీవ్ర సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిని చేజిక్కించుకుంటూ వస్తున్న తాలిబాన్లు ఇవాళ రాజధాని కాబూల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించింది. ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితులయ్యారు.

కాగా, కాబూల్ లో శాంతిభద్రతలపై ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలను కోరారు. కాగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ను విడిచి తజకిస్థాన్ లో ఆశ్రయం పొందినట్టు ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.